సునామీలా ఊర్లోకి వచ్చిన సముద్రం.. బోట్లు గల్లంతు

సునామీలా ఊర్లోకి వచ్చిన సముద్రం.. బోట్లు గల్లంతు

అరేబియా సముద్రానికి ఆనుకొని ఉన్న కేరళ రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఆదివారం ఉప్పెన సంభవించింది. తీర ప్రాంతమైన కేరళ, దక్షిణ తమిళనాడులో సముద్ర అలలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. బలమైన అలలు, సముద్రాన్ని అల్లకల్లోలం చేశాయి. దాదాపు మీటరు ఎత్తున అలలు ఎగిసిపడి తీరంలోని జనావాస ప్రాంతాలని ఉక్కిరిబిక్కిరి చేసింది. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, త్రిస్సూర్ తీరప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. తిరువనంతపురంలోని పుతెంతోపు,ఆదిమలతుర,పొజియూర్,పూంతుర వంటి ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు, పూర్తిగా జలమయమయ్యాయి. త్రిస్సూర్ లో పడవలు ధ్వంసమైయ్యాయి. ఇల్లలోకి సముద్ర నీరు చేరింది. 

also read : వామ్మో Portable AC అంత చౌకా: రూ. 1500 లకే మినీ ఏసీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

తిరువనంతపూరంలో పర్యటక కార్యక్రమాలు తాత్కాలికంగా నిషేధించారు. వరద ప్రభావిత బాధితులను సహాయక శిబిరాలకు తరలించారు. ఆదివారం రాత్రి 11గంటల సమయంలో తుఫాన్ సంభవించడంతో ప్రభుత్వ అధికారుల యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాల కలెక్టర్లు, విపత్తు నిర్వాహణ అథారిటీ తీర ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతానికి తరలించారు. మత్యకారులను సముద్రంలోని వెళ్లకుండా ఆదేశించారు.