Kerala blasts : కేరళ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

Kerala blasts : కేరళ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

కేరళ చర్చి బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడిని విచారించిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.  రెండు రోజులు క్రితం చర్చిలో ప్రార్థనా సమయంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కు బాధ్యత వహిస్తూ పోలీసులకు లొంగిపోయిన డొమినిక్ మార్టన్ ను మంగళవారం పోలీసులు విచారించారు. మార్టన్ తెలివైన వ్యక్తి అని.. గల్ఫ్ లో లాభదాయకమైన ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడికి  వచ్చి ఈ దారుణానికి పాల్పడటం వెనక రహస్యాన్ని త్వరలో ఛేదిస్తామని చెప్పారు. ఆదివారం పేలుళ్లు జరిగిన కొన్ని గంటల తర్వాత లొంగిపోయిన మార్టిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఆదివారం జరిగిన పేలుళ్లలో ముగ్గురు మృతిచెందగా.. 50 మంది గాయపడ్డారు.. అయితే పేలుళ్లకు పలు కీలక విషయాలను విచారణలో మార్టిన్ నుంచి రాబట్టారు పోలీసులు. పేలుళ్లకు వినియోగించిన పదార్థాల కొనుగోలుకు సంబంధించిన బిల్లులను మార్టీన్ పోలీసులు సమర్పించాడు. అయితే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేందుకు విదేశాల్లో మంచి ఉద్యోగాన్ని మార్టిన్ వదులుకొని రావడం పట్ల పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఎలక్ట్రానిక్స్ లో మార్టిన్ కు మంచి ప్రావీణ్యంపైనే కేసు పోలీసులు విచారణ కొనసాగించారు. అయితే చర్చిలో మతపరమైన బోధనలు విద్రోహపూరితమైనవి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని మార్టీన్ తెలిపారు. 
క్రిస్టియన్ భావజాలం దేశానికి ప్రమాదకరమని.. అందువల్లే కేరళలో దాని ఉనికిని ముగించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్టిన్ తెలిపాడు. సంస్థ బోధనలను సరిదిద్దాలని తాను చాలా సార్లు చె్ప్పానని అయితే సంస్థ అలా చేయడానికి సిద్దంగా లేదని చెప్పాడు. నాకు వేరే మార్గం లేక ఈ నిర్ణయం తీసుకున్నానని మార్టిన్ వెల్లడించారు. 

విదేశాల్లో సక్సెస్ ఫుల్ కేరీర్ ను వదులుకొని మార్టిన్ పేలుడులో ఎందుకు పాల్గొన్నాడన్న విషయాన్ని మరింత లోతుగా దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ముందుకు వెళ్లే కొద్దీ మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు పోలీసులు.