
తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయినందుకు ఆన్‌లైన్‌లో కొందరు ట్రోల్ చేయడంతో మనస్తపానికి గురై కేరళలో ఒక ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య చేసుకుని మరణించింది.12వ తరగతి చదువుతున్న యువతి గత వారం తిరువనంతపురంలోని తన ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయినందుకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోల్ చేయడంతో మనస్తపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబం తెలిపింది. విడిపోయిన తరువాత ఆమె బాయ్ ఫ్రెండ్ అనుచరులు సోషల్ మీడియాలో వీపరితంగా ట్రోల్ చేశారని చెప్పారు. రెండు నెలల క్రితమే అతడితోనితో ఆమె విడిపోయిందని.. ఈ క్రమంలో ట్రోల్స్ తో తీవ్ర మనస్తాపానికి గురైందని వారు తెలిపారు.
బాలిక మృతికి సంబంధించి ఆమె మాజీ ప్రియుడు 18 ఏళ్ల బినోయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నెడుమంగడ్‌లోని ఉజమలక్కల్‌కు చెందిన బినోయ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై సైబర్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తదుపరి విచారణ చేపట్టనుంది.