ఓనం ఊపేసింది : 30 రోజుల్లో రూ. వెయ్యి 799 కోట్ల మందు తాగారు.. చంద్రయాన్ బడ్జెట్ బలాదూర్

ఓనం ఊపేసింది : 30 రోజుల్లో రూ. వెయ్యి 799 కోట్ల మందు తాగారు.. చంద్రయాన్ బడ్జెట్ బలాదూర్

కేరళ ఓనం వేడుకల్లో మద్యం విక్రయాలు రికార్డు సృష్టించాయి. ఎంతలా అంటే మద్యం అమ్మకాలు చంద్రయాన్ 3 బడ్జెట్ ను కూడా దాటి పోయాయి. రాష్ట్రంలో ఏకైక  మద్యం వ్యాపారి అయిన కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ప్రకారం గత 10 రోజుల్లో రూ. 759 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. అంతేకాదు ఆగస్టు 2023లో కేరళలో మొత్తం రూ.1799 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. 

డేటా ప్రకారం.. గతేడాదితో  పోలిస్తే మద్యం అమ్మకాలు రూ. 8.5 శాతం  అంటే రూ. 59 కోట్లు పెరిగాయన్నమాట.  గురువారం విడుదల చేసిన అమ్మకాల డేటా ఆగస్టు 21 నుంచి ఆగస్టు 29న ఉత్సవాల ప్రధాన రోజు వరకు  మద్యం అమ్మకాల డేటా.. ఈ పది రోజుల్లోనే 759 కోట్ల విలువైన మద్యం సేవించారు కేరళ ప్రజలు. డేటా ప్రకారం..గత సంవత్సరం మద్యం అమ్మకాలు రూ.700 కోట్లతో పోలిస్తే ఇది 8.5 శాతం లేదా రూ.59 కోట్లు ఎక్కువ. ఈ విక్రయం పన్నుల ద్వారా రాష్ట్ర ఖజానాను ఆశ్చర్యపరిచే విధంగా రూ.675 కోట్లు చేరుతుంది. 

రాష్ట్రంలో మొత్తం 269 మద్యం విక్రయ కేంద్రాలుండగా.. అందులో ఒకటైన మలప్పురం  జిల్లాలోని తిరూర్ లోని బెవ కో అవుట్ లెట్ అత్యధిక విక్రయాలను కలిగి ఉంది.  త్రిసూర్ జిల్లాలో ఇరింజలకుడ మద్యం అమ్మకాల్లో రెండో స్థానంలో ఉంది. 

ఓనమ్ కు ఒక రోజు ముందు రోజైన సోమవారం.. అత్యధికంగా  మద్యం అమ్మకాలు జరిగినట్లు డేటా ప్రకారం తెలుస్తోంది. ఆ ఒక్క రోజే 6 లక్షల మందికి పైగాన బెవ్ కో అవుట్ లెట్ లనుంచి రూ. 120 కోట్ల మద్యం అమ్మకాలు కొనుగోలు చేశారని  తెలుస్తోంది. ఇరింజలకుడ ఔట్‌లెట్‌లో సోమవారం అత్యధికంగా రూ.1.06 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. దీని తర్వాత కొల్లాంలోని ఆశ్రమం బెవ్‌కో ఔట్‌లెట్‌లో రూ.1.01 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.