తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం (జులై 31న) జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. మంత్రి మండలిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ర్టంలో జులై 18 నుంచి 28వ తేదీ వరకు చాలా పెద్ద ఎత్తున కురిసిన భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పారు. భారీ వరదల వల్ల 27 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. 

కేబినెట్ నిర్ణయాలు ఇవే.. 

* రోడ్లు పునరుద్ధరణ కోసం తక్షణ సాయం కింద  రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం

* రాష్ట్రంలోని ఇద్దరు విద్యుత్ వీరులకు పంద్రాగస్టు నాడు సత్కారం చేయాలని నిర్ణయం

* ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న ఒక ఉపాధ్యాయుడు దాదాపు 40 మంది విద్యార్థులను ప్రాణాలను కాపాడినందుకు ఆయనకు సన్మానం చేయాలని నిర్ణయం

* ఖమ్మంలో మున్నేరు నది వెంట రిటైనింగ్ వాల్ నిర్మించాలని నిర్ణయం. దీనిపై నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశం

* రాష్ట్రంలో రైతులకు విత్తనాలు, ఎరువులను వెంటనే సరఫరా చేయాలని నిర్ణయం

* భారీ వర్షాల కారణంగా 40మందికి పైగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా అందించాలని నిర్ణయం

* భారీ వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని (మరమ్మతులు చేయాలని) నిర్ణయం 

* మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్‌ మెట్రో వ్యవస్థను భారీగా విస్తరించాలని కేబినెట్‌లో నిర్ణయం

* టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం 

* అనాథ పిల్లల సంరక్షణ కోసం ఆర్ఫన్‌ పాలసీ

* గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఇద్దరు సభ్యులు (దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ) ఎంపిక

* మహబూబాబాద్‌లో ఉద్యాన కళాశాల ఏర్పాటుకు ఆమోదం

* హైదరాబాద్‌లో హైబ్రిడ్‌ విధానంలో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు

* నిమ్స్‌లో రూ.1800 కోట్లతో మరో 2 వేల పడకల ఏర్పాటు

* బీడీ కార్మికులతో పాటు బీడీ టేకేదారులకు పింఛన్లు

* వరంగల్‌ మమునూరులో విమానాశ్రయం కోసం 253 ఎకరాలు ఇవ్వడానికి కేబినెట్‌ ఆమోదం

* గవర్నర్‌ వెనక్కి పంపిన 3 బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించి పంపేందుకు కేబినెట్‌ నిర్ణయం