ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

ఫోన్  ట్యాపింగ్‌ కేసు.. రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4 ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.  ఐఎస్‌బీ మాజీ చీఫ్ ప్రభాకర్ అదేశాలతో 2018లో  భవ్య సిమెంట్ యజమాని,  ఆనంద్ ప్రసాద్ నుంచి రూ. 70 లక్షలు సీజ్ చేశామని రాధాకిషన్ రావు వెల్లడించారు.  దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు, బంధువుల నుంచి రూ. కోటి సీజ్  చేసినట్లుగా రాధా కిషన్ రావు అంగీకరించారు.  

ముడుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన రూ. 3.50 కోట్ల సీజ్ చేశామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.  2016లో ఓ వర్గం చెందిన అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నామని..  నల్లగొండ నుంచి ప్రణీత్ రావు, రాచకొండ భుజంగరావు, హైదరాబాద్ సిటీ తిరుపతిని నియమించుకున్నట్లుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు  పేర్కొన్నారు.  

ALSO READ :- కేసీఆర్‌ ఇంత దిగజారి మాట్లాడుతారా.. భట్టి విక్రమార్క ఫైర్

2023 లో మూడో సారి బీఆర్ఎస్ పార్టీని అధికారం లో తెచ్చేందుకు పని చేసిన SIB , టాస్క్ ఫోర్స్ టీమ్స్ పనిచేసినట్లుగా పోలీసులు తెలిపారు.  అధికార పార్టీ నేతల ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రాధ కిషన్ రావు  అంగీకరించారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కి చెందిన డబ్బులను టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు.  కాగా  హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీగా ఉన్న రాధాకిషన్ రావును ఈ కేసులో ఏ4గా చేర్చారు.