కిలో మటన్ రూ. 400కే అమ్ముతున్రు

కిలో మటన్ రూ. 400కే అమ్ముతున్రు

ప్రస్తుతం మార్కెట్ లో నాన్ వెజ్ రెట్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయ్. మటన్ ధరలైతే కిలో రూ. 700 నుంచి రూ. 800 వరకు అమ్ముతున్నారు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఆ ధరలు ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేట లో మాత్రం కిలో మటన్ రూ. 400కే అమ్ముతున్నారు. నెలరోజుల నుంచి ఇదే ధరకు అమ్ముతున్నారు మటన్ షాపు ఓనర్లు. దీంతో విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో నాన్ వెజ్ లవర్స్ పోటెత్తున్నారు. 

నిన్న ఆదివారం, మహాలయ అమావాస్య కావడంతో అక్బర్ పేట రద్దీగా మారింది. దుబ్బాక, మిరుదొడ్డి, గజ్వేల్ , దోమకొండా, బీబీపేట, రామాయంపేట, చేగుంట, దౌల్తాబాద్  మండలాల భారీగా తరలివచ్చారు. సిద్దిపేట మెదక్ ప్రధాన రహదారి వాహనాలతో నిండింది.  భూంపల్లి పోలీసులు మాంసం ప్రియులను కంట్రోల్ చేశారు. రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. తక్కువ ధరకు మటన్ వస్తుండటంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.