మున్సిపల్ పనుల్లో స్పీడ్ పెంచాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌

మున్సిపల్ పనుల్లో స్పీడ్ పెంచాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం రివ్యూ నిర్వహించారు. పట్టణంలోని తన క్యాంప్ ఆఫీస్‌‌‌‌లో మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ దండి లక్ష్మి, వైస్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ చిత్తారి పద్మ, కౌన్సిలర్లతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణ అభివృద్ధిలో కౌన్సిలర్ల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు.

పెండింగ్‌‌‌‌ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వార్డుల్లో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కౌన్సిలర్లు లత, మంజుల, రజిత, సరిత, కిరణ్, వరప్రసాద్, సంపత్, పార్టీ నాయకులు
 పాల్గొన్నారు.