
హైదరాబాద్ నగరంలో గణేషుల నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతోంది. దేశంలో అతిపెద్ద వినాయకుడుగా పేరుగాంచిన ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జన శోభాయాత్ర ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకుంది.. మరొకొద్ది సేపట్లో బాహుబలి క్రేన్ తో మహాశక్తి గణపతి నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా బాహుబలి క్రేన్ ఆపరేట్ చేస్తున్న ఆపరేటర్ V6 తో తన అనుభూతిని, అనుభవాన్నిపంచుకున్నారు.
గత ఐదేళ్లుగా బడా గణేష్ నిమజ్జన బాహుబలి క్రేన్ ను ఆపరేట్ చేస్తున్నాను.. చాలా సంతోషంగా ఉంది.. ఇండియాలో అతిపెద్ద గణేషుడి నిమజ్జనం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు. గణేషుని ఎత్తును మీటర్లలో లెక్కలు వేసుకొని నిమజ్జనం చేసేందుకు అపరేట్ చేస్తామని క్రేన్ ఆపరేటర్ చెప్పారు.
మరోవైపు మహాగణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. లక్షలాది మంది భక్తులతో ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి.. ఇసుక వేస్తే రాలనంత జనం సచివాలయం, ఎన్టీఆర్ మార్క్ లో సందడి చేస్తున్నారు. బడా గణేషుని నిమజ్జనం చూసేందుకు పోటీ పడుతున్నారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు.. గణేష్ నిమజ్జనం తిలకించిందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గం.కు ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది.