హైదరాబాద్ లో భక్తి శ్రద్ధలతో చవితి పూజలు

హైదరాబాద్ లో భక్తి శ్రద్ధలతో చవితి పూజలు

ఖైరతాబాద్ : వినాయక చవితిని గ్రేటర్ జనం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు.  సోమవారం ఖైరతాబాద్ బడా గణేశునికి గవర్నర్ తమిళిసై తొలి పూజ చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. బడా గణేశ్​ను చూసేందుకు సోమ, మంగళవారాల్లో భక్తులు పోటెత్తారు. సిటీలో డిఫరెంట్ థీమ్​లతో తయారు చేసిన గణనాథుని విగ్రహాలు ఆకట్టుకున్నాయి.

మరోవైపు గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను సిటీ సీపీ ఆనంద్ మంగళవారం పర్యవేక్షించారు. ఇవ్వాల్టి నుంచి జరుగనున్న నిమజ్జనాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, పోలీస్‌‌‌‌‌‌‌‌ అధికారులతో కలిసి ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌,పీవీ నర్సింహారావు మార్గ్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్గ్​లో క్రేన్ల ఏర్పాట్లను పరిశీలించారు.

నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు,బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి చర్చించారు.