
ఖైరతాబాద్ వినాయకుడు పూర్తిగా నిమజ్జనమయ్యేలా పూడిక తీయిస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై తలసాని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మధ్యాహ్నం 12 గంటల కల్లా ఎన్టీఆర్ మార్గ్‌ను చేరుతుందన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిమజ్జనం పూర్తవుతుందని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారన్న మంత్రి తలసాని.. క్రేన్ నంబర్ 6 దగ్గర ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం అవుతుందన్నారు.