ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ మృతి

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ మృతి

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ మరణించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో 1954లో ఖైరతాబాద్ లో తొలిసారి ఒక అడుగు వినాయకుడిని ప్రతిష్టించారు. ఆ తర్వాత ఏటా ఒక్కో అడుగు పెంచుతూ 2014 నాటికి 60 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత పర్యావరణం, శోభయాత్ర నిబంధనలతో వినాయకుడి ఎత్తును పెంచడం ఆపేశారు. ఖైరతాబాద్లో ప్రతిఏటా ప్రతిష్ఠించే మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు.