సెప్టెంబర్ 28న ఉదయం 6 గంటల నుంచి.. ఖైర‌తాబాద్ గ‌ణేశుడి శోభాయాత్ర

సెప్టెంబర్ 28న ఉదయం 6 గంటల నుంచి.. ఖైర‌తాబాద్ గ‌ణేశుడి శోభాయాత్ర

రేపు(సెప్టెంబర్ 28) ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో ఖైర‌తాబాద్ గ‌ణేశుడికి బుధ‌వారం(సెప్టెంబర్ 27) అర్ధరాత్రి ప్రత్యేక పూజ‌లు నిర్వహించ‌నున్నారు. 

రేపు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి 2 గంట‌ల మ‌ధ్య నిమ‌జ్జనం చేయ‌నున్నట్లు గ‌ణేశ్ ఉత్సవ స‌మితి వెల్లడించింది. 

భారీ బందోబస్తు..

హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌ణేశ్ నిమ‌జ్జన కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ‌ణేశ్ నిమ‌జ్జన కార్యక్రమం కోసం హైద‌రాబాద్‌లో 40 వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగ‌ర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, ప‌దుల కొద్ది జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమ‌జ్జన ప్రదేశాలు సిద్ధమ‌య్యాయి.

 దాదాపు 48 గంట‌ల పాటు సాగే ఊరేగింపును 20 వేల‌కు పైగా సీసీ కెమెరాల‌తో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి ప‌ర్యవేక్షించ‌నున్నారు.

Also Read :- గణేష్ నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు

భారీగా భక్తుల రాక....

సెప్టెంబర్ 28న ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో... ఈరోజు(సెప్టెంబర్ 27) భారీగా భక్తులు తరలివస్తున్నారు. భారీ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ‌ణేశ్ నిమ‌జ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నారు.