ఖైరతాబాద్ మహాగణేశుడి శోభాయాత్రకు భారీగా భక్తులు

V6 Velugu Posted on Sep 19, 2021

ఖైరతాబాద్ మహాగణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఊరేగింపు రథంపై గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాగణనాథుడిని చూడటానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. టెలీఫోన్ భవన్, ఓల్డ్ సెక్రటేరియేట్ గేట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్,లుంబినీ పార్క్ మీదుగా దాదాపు 2కి.మీ మేర శోభాయాత్ర కొనసాగనుంది. దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. భక్తులకు ఫ్రీగా మాస్కులు ఇస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు, హుస్సే సాగర్ లో క్రేన్ నంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం సాగనుంది. మధ్యాహ్నం  గంటలకల్లా వినాయక నిమజ్జనం పూర్తి కానుంది.

Tagged Tankbund, Khairatabad Mahaganesh Shobhayatra

Latest Videos

Subscribe Now

More News