
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి హైదరాబాద్ రైల్వేస్టేషన్ వరకూ దక్షిణ మధ్య రైల్వే ట్రాక్‌పునరుద్దరణ పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో ఖైరతాబాద్ రైల్వే గేటు లెవల్ క్రాసింగ్ నెం. 30 ని వారం రోజుల పాటు మూసివేయనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ ఇక్కడ లెవల్ క్రాసింగ్‌ను మూసివేయనున్నారు. ఈ ప్రాంతం ద్వారా ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ మళ్లింపు కోసం పోలీసులు కూడా ఏర్పాట్లు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను కోరింది.