ఫ్యాన్సీ నంబర్లతో రూ.41 లక్షల రెవెన్యూ

ఫ్యాన్సీ నంబర్లతో  రూ.41 లక్షల రెవెన్యూ
  • ఫ్యాన్సీ నంబర్లతో  రూ.41 లక్షల రెవెన్యూ
  • రూ.15 లక్షలు పలికిన 9999 నంబర్

హైదరాబాద్, వెలుగు: ఫ్యాన్సీ నంబర్ల వేలంతో ఆర్టీఏకి రూ.41,86,370 ఆదాయం వచ్చింది. గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ (  సెంట్రల్ జోన్ ) లో ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించినట్లు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ( జేటీసీ) పాండురంగ నాయక్ తెలిపారు. టీఎస్ 09 జీడీ9999 నంబర్ ను రూ. 15లక్షల 53 వేలకు  ముప్పాహోమ్స్ కంపెనీ దక్కించుకుందని  ఒక ప్రకటనలో జేటీసీ తెలిపారు. 

ఇక, టీఎస్  09 జీఈ 0009 నంబర్  రూ.3లక్షల 30 వేలకు అమ్ముడు పోగా, టీఎస్  09 జీఈ 0001 ఫ్యాన్సీ నంబర్ రూ.3లక్షల 6వేలు పలికింది.  టీఎస్ 09 జీఈ 0005 నంబర్ రూ.2,10,000, టీఎస్ 09జీఈ 0019 నంబర్ రూ.2,03,000,  టీఎస్ 09 జీఈ0006 నంబర్ రూ.1,09,000,  టీఎస్ 09 జీఈ0007 నంబర్ రూ.1,61,116 వేలంలో అమ్ముడయ్యాయని పాండురంగనాయక్  పేర్కొన్నారు.