అగ్రి చట్టాలపై నిరసన.. అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం

అగ్రి చట్టాలపై నిరసన.. అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం

అమెరికాలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు నిరసన కారులు. ఇండియాలో అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా అమెరికాలో రాజధాని వాషింగ్టన్ డీసీలో సిక్కు వర్గానికి చెందిన వందలాది మంది నిరసనకు దిగారు. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఒహియో , నార్త్ కరోలినా వంటి ఇతర రాష్ట్రాల నుండి అనేక మంది శనివారం కార్ ర్యాలీని నిర్వహించారు. ఇండియన్ ఎంబసీ వద్దకు వచ్చారు. ఇదే అదునుగా తీసుకున్న ఖలిస్తాన్ వేర్పాటు వాదులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆయన విగ్రహానికి ఖలిస్తాన్ జెండాలు కప్పారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను  ఉరితీసి నిరసన తెలిపారు. దీన్ని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వారు వారిని హెచ్చరించారు. వీలైనంత త్వరగా విగ్రహ ధ్వంసానికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఎంబసీ అమెరికా విదేశాంగా శాఖను కోరింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. యూఎస్ చట్టాల ప్రకారం విగ్రహాలు ధ్వంసం చేస్తే 10ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశముంది.