ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ మద్దతుదారుల ఓవర్యాక్షన్.. ధీటుగా స్పందించిన ఇండియన్స్

ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ మద్దతుదారుల ఓవర్యాక్షన్.. ధీటుగా స్పందించిన  ఇండియన్స్

మెల్‌‌బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్‌‌బోర్న్‌‌లో భారత కాన్సులేట్ వద్ద జరిగిన 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఖలిస్తానీ మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారత సంతతి ప్రజలు  జాతీయ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తి గీతాలతో వేడుకలు జరుపుకుంటుండగా.. ఖలిస్తాన్ జెండాలు పట్టుకుని భారత్‎కు వ్యతిరేక నినాదాలు చేస్తూ ఓ గ్రూప్ ఆందోళన చేపట్టింది. దీంతో భారతీయులు భారత్ మాతా కీ జై, వందేమాతరం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 ఈ ఘటనతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మెల్‌‌బోర్న్‌‌లోని భారత కాన్సుల్ జనరల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకలకు భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాన్సుల్ జనరల్ సుశీల్ కుమార్, స్థానిక ఎంపీ బ్రాడ్ బాటిన్, మారిబిర్నాంగ్ మేయర్ క్రా ప్రదీప్ తివారీ తదితరులు పాల్గొన్నారు.