ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సన్మానం

 ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సన్మానం

ఖమ్మం టౌన్, వెలుగు : ఉద్యోగ విరమణ పొందిన  పోలీస్ అధికారులను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్సన్మానించి జ్ఞాపికను అందజేశారు. శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ మాట్లాడారు. 

సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాల్లో బాధ్యతాయుతమైన విధులు నిర్వహించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఏసీపీ మహేశ్, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఆర్ఐ కామరాజు, సురేశ్, పోలీస్ అసోసియేషన్ ఇన్​చార్జి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.