
ఖమ్మం టౌన్, వెలుగు : బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలుశిక్ష, రూ. 50 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం జిల్లా ఫస్ట్ క్లాస్ అడిషనల్ జడ్జి కె. ఉమాదేవి బుధవారం తీర్పు చెప్పారు. వైరా సీఐ సాగర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో వైరా మండలం గొల్లనపాడు గ్రామానికి చెందిన చెరుకూరి లాలయ్య(70), ఆరేండ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో వైరా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేసి, అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడు లాలయ్యకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.