
ఖమ్మంలో టెక్నాలజీతో పంటలు సాగుచేస్తున్నారు రైతులు. గంగాధర మండలంలో డ్రోన్ తో పురుగుల మందు కొట్టారు రైతులు. కంది చేనుకు తెగుళ్లు సోకడంతో గ్రామానికి చెందిన డోర్నాల హన్మంతరెడ్డి, గుడి గోపాల్రెడ్డి, రమణారెడ్డి, రాజు, నందికొండ రాజిరెడ్డి డ్రోన్ తో ఎకరా పంటకు 10 నుంచి 15 నిమిషాల్లో మందు కొట్టారు. ఇందుకు ఖర్చు రూ.500 నుంచి రూ.600 వచ్చిందని చెబుతున్నారు రైతులు.