
- కొత్తగూడెం, మణుగూరు మున్సిపాలిటీలకు ఫండ్స్రాలే..
- పన్నుల వసూళ్లను బట్టి కేంద్రం నుంచి నిధులు సాంక్షన్
- పన్నుల వసూళ్లలో వెనుకబడిన ఖమ్మం, కొత్తగూడెంకార్పొరేషన్లు, మణుగూరు మున్సిపాలిటీ
- ఖమ్మం రూ.6కోట్లు, కొత్తగూడెం రూ.2 కోట్లు, మణుగూరు రూ. కోటి ఫండ్స్ కోల్పోయిన వైనం..
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం కార్పొనేషన్లతోపాటు మణుగూరు మున్సిపాలిటీలు పన్నుల వసూళ్లలో టార్గెట్ రీచ్ కాకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. మున్సిపల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం ఆ మున్సిపాలిటీలకు శాపంగా మారింది. అసలే నిధులు లేక నీరసిస్తున్న టైంలో వచ్చే నిధులనూ తెచ్చుకోలేనిదుస్థితి.
ఇదీ పరిస్థితి...
మున్సిపాలిటీలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ ప్రకారం పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. వసుళ్ల ఆధరంగానే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం సాంక్షన్ చేస్తుంది. కాగా, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టార్గెట్ ప్రకారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీలు పన్నులను వసూలు చేశాయి. దీంతో ఇల్లెందు మున్సిపాలిటీకి రూ. 75లక్షలు, పాల్వంచ మున్సిపాలిటీకి రూ.1.85కోట్ల మేర ఫండ్స్ ఇటీవలే రిలీజ్ అయ్యాయి. కానీ, కొత్తగూడెం, మణుగూరు మున్సిపాలిటీలు టార్గెట్రీచ్ కాకపోవడంతో15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఆపేసింది.
దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీ(ప్రస్తుతం కార్పొరేషన్ ) దాదాపు రూ. 2కోట్లు, మణుగూరు మున్సిపాలిటీ రూ.కోటి ఫండ్స్‌ను కోల్పోవాల్సి వచ్చింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్ధేశించిన పన్నుల టార్గెట్‌ను కొత్తగూడెం మున్సిపాలిటీ వసూలు చేయకపోవడంతో ఈ సారి కూడా రూ.కోట్లలో నిధులు రాకుండా పోయే పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలో టార్గెట్ పూర్తి చేసిన సత్తుపల్లి మున్సిపాలిటీకి రూ. 74లక్షలు, వైరా మున్సిపాలిటీకికు రూ. 74లక్షలు సాంక్షన్ అయ్యాయి. కానీ, ఖమ్మం కార్పొరేషన్‌కు పన్నుల వసూళ్లలో టార్గెట్చేరుకోపోవడంతో దాదాపు రూ. 6కోట్ల మేర నిధులు ఆగిపోయాయి.
ఆఫీసర్లు విఫలమయ్యారనే విమర్శలు..
పన్నుల వసూళ్లపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంలో ఆఫీసర్లు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేకంగా వార్డు ఆఫీసర్లను నియమించింది. బిల్కలెక్టర్లు ఉన్నారు. కానీ పన్నుల వసూళ్లలో ఖమ్మం, కొత్తగూడెం కార్పొరేషన్లతోపాటు మణుగూరు మున్సిపాలిటీ వెనుకబాటులో ఉండడంతో రూ. కోట్ల నిధులు రాకుండా పోయాయి. ఆఫీసర్ల నిర్లక్ష్యంపై కలెక్టర్ విచారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.