ఏపీకే ఫైల్ ఓపెన్ చేస్తే రూ.లక్ష మాయం 

 ఏపీకే ఫైల్ ఓపెన్ చేస్తే రూ.లక్ష మాయం 

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని బాలాజీ నగర్ కు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ కు వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్​ చేయగానే రూ.లక్ష అకౌంట్​ నుంచి మాయమయ్యాయి. సైబర్ మోసానికి గురై తన క్రెడిట్ కార్డు ద్వారా రూ.లక్ష బ్యాంకు ఖాతా నుంచి మరో రూ.12,200 అనధికారికంగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించి గురువారం సదరు వ్యక్తి ఖానాపురం హావేలి పీఎస్​లో ఫిర్యాదు చేసినట్లు సీఐ భాను ప్రకాశ్​తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బ్యాంకు కస్టమర్ కేర్ ను సంప్రదించి, లావాదేవీలు నిలిపివేయించినట్లు పేర్కొన్నారు. సైబర్ క్రైం హెల్ప్ లైన్ సెంటర్ 1930 ను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.