స్టేడియంలో నవ్వులే నవ్వులు : టాస్ వేయమంటే బౌలింగ్ వేశాడు

స్టేడియంలో నవ్వులే నవ్వులు : టాస్ వేయమంటే బౌలింగ్ వేశాడు

బ్రిస్బేన్‌: టాస్ వేసే క్రమంలో ఓ ప్లేయర్ చూపించిన అత్యుత్సాహం నవ్వుల పాలైంది. ఆస్ట్రేలియా దేశవాళీ మ్యాచ్ లో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా-క్వీన్ప్ లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆటకు ముందు టాస్ వేయడానికి రెండు టీమ్స్ కెప్టెన్లు అయిన ఉస్మాన్‌ ఖవాజా-టర్నర్‌లు మైదానంలోకి  పిలిచారు అంపైర్లు.  అయితే కాయిన్‌ను ఖవాజా అందుకుని టాస్‌ వేయడానికి సిద్ధమైన క్రమంలో నవ్వులు పూయించాడు.

టాస్‌ను ఒక ఎండ్‌లో వేస్తే అది మరొక ఎండ్‌లో పడింది. టాస్‌ కాయిన్‌ అందుకున్న ఖవాజా..  టాస్‌ వేయమని మ్యాచ్‌ రిఫరీ ఓకే చెప్పగానే కాస్త ముందుకు దూకుతూ వెళ్లాడు. ఆ కాయిన్‌ను పైకి గట్టిగా విసరగా అది చాలా దూరంగా పడింది. 10 మీటర్ల దూరంగా వెళ్లింది. రిఫరీ నవ్వుకుంటూ కాయిన్‌ పడిన చోటకు వెళ్లి వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా టాస్‌ గెలిచిందని చెప్పాడు. ఇక్కడ ఖవాజా ట్రిక్‌ను ప్రదర్శించినా టాస్‌ గెలవలేకపోయాడు. సాధారణంగా టాస్‌ వేస్తే కాయిన్‌ ఇంచుమించు కెప్టెన్లు నిలబడి ఉన్న చోటనే పడుతుంది.

ఖవాజా టాస్‌ వేసిన తీరును వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దాంతో ఖవాజాపై సెటైర్లు పేలుతున్నాయి. టాస్‌ వేయమంటే.. బౌలింగ్‌ చేసేవేంట్రా నాయన అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రన్‌ టర్నర్‌ నేతృత్వంలోని వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా గెలిచి టైటిల్‌ కైవసం చేసుకుంది.  ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన ఉస్మాన్‌ ఖవాజా కెప్టెన్సీలో  క్వీన్స్‌లాండ్‌ 49.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్‌ కాగా, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా 48 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను మీరు ఓ లుక్కేయండి.

Read Also: మహిళ బస్సు ముందుకు రావడం వల్లే ప్రమాదం: డిపో మేనేజర్