నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా.. మోదీ పనిచేస్తున్నారు: ఖష్బూ

నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా..  మోదీ పనిచేస్తున్నారు: ఖష్బూ

సికింద్రాబాద్: ప్రపంచంలో మూడవ ఆర్ధిక శక్తిగా భారత్ ను నిలపడమే ధ్యేయంగా రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ప్రధాని మోడీ గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యురాలు, నేషనల్ ఉమెన్ కమిషన్ కుష్బూ సుందర్ పిలుపునిచ్చారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రంలో బీజేపీని గెలిపించాలని  కుష్బూ కోరారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో 2024, ఫిబ్రవరి 29వ తేదీ గురువారం నిర్వహించిన బైక్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. 

ALSO READ :- AI ఫీచర్తో Samsung Galaxy స్మార్ట్ రింగ్.. ఫుల్ డిటెయిల్స్ ఇవిగో

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కంటోన్మెంట్ సమస్యలను తీర్చేది కేంద్రమని.. కంటోన్మెంట్ ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలన్నారు. ఒక్క నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా దేశం కోసం పని చేస్తున్న వ్యక్తి మోడీ అని పేర్కొన్నారు. 400 సీట్లతో రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మోడీ విజయ ఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డిజిటల్ రంగంలో, విమానయాన, రైల్వే, త్రివిధ దళాలు, జాతీయ రహదారులు, అన్ని రంగాల్లో వృద్ధిని సాధించారన్నారామె. 

మహిళలు, యువతకు అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు ఆమె తెలిపారు. కరోనా విపత్కర సమయంలో అందరికీ ఉచితంగా టీకాలు ఇచ్చామని, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛ కల్పించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో గొప్ప అవకాశాలను కల్పించిందని.. .కాంగ్రెస్ లో కుటుంబ పాలన తప్ప.. దేశానికి చేసిందేమీ లేదని ఖుష్బూ విమర్శించారు.