AI ఫీచర్తో Samsung Galaxy స్మార్ట్ రింగ్.. ఫుల్ డిటెయిల్స్ ఇవిగో

AI  ఫీచర్తో Samsung Galaxy స్మార్ట్ రింగ్.. ఫుల్ డిటెయిల్స్ ఇవిగో

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ సామ్ సంగ్ .. మొట్ట మొదటి స్మార్ట్ రింగ్ వివరాలను బయటపెట్టింది. చేతివేళ్లకు ధరించగలిగే ఈ స్మార్ట్ రింగ్ తో హృదయ స్పందన రేటు, పల్స్ రేట్, నిద్రలో కదలికలను, నిద్ర పట్టే సమయాన్ని ట్రాక్ చేస్తుంది. ఈ డేటా మొత్తం Samsung App ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ రింగ్ ద్వారా వినియోగదారులు కాంటాక్ట్ లెస్ చెల్లింపులు కూడా చేయొచ్చు. స్పెయిన్ లోని బార్సిలోనా లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో సామ్ సంగ్ కంపెనీ ఈ స్మార్ట్ రింగ్ ఫీచర్లు, ఇతర వివరాలను వెల్లడించింది. 

ALSO READ :- Drishyam Movie: హాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న..మలయాళ మర్డర్ మిస్టరీ దృశ్యం

Samsung ఈ గెలాక్సీ రింగ్ మూడు రంగులలో లభిస్తుంది. సిరామిక్ బ్లాక్, ప్లాటినం సిల్వర్, గోల్డ్ కలర్లలో ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. హార్ట్ బీట్ రేట్, కదలికలు, శ్వాస, నిద్రలను పరిశీలించే సామర్థ్యం కలిగి ఉంటుంది. Samsungఈ స్మార్ట్ రింగ్ లో హెల్త్ ట్రాకింగ్ కోసం AI ఉపయోగిస్తున్నారు కంపెనీ వర్గాలు చెపుతున్నాయి. ఇది వ్యక్తి ఆరోగ్యం గురించి లోతైన పరిశీలన చేసి  అప్ డేట్ ను అందిస్తుందని చెప్పారు.