కియా కేరెన్స్: మార్కెట్లోకి మల్టీ పర్పస్​ వెహికల్​

కియా కేరెన్స్: మార్కెట్లోకి మల్టీ పర్పస్​ వెహికల్​

హైదరాబాద్​, వెలుగు: కియా ఇండియా కేరెన్స్​ పేరుతో మిడ్​రేంజ్​ మల్టీ పర్సస్​ వెహికల్​ను ఇండియా మార్కెట్లో మంగళవారం లాంచ్ చేసింది. ఏడుగురు కూర్చోగల ఈ వెహికల్​ ఎక్స్​షోరూం ధరలు రూ.9 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉంటాయి. ఇది ప్రీమియం, ప్రెస్టిజ్​, ప్రెస్టిజ్​ ప్లస్​, లగ్జరీ, లగ్జరీ ప్లస్​ వేరియంట్లలో వస్తుంది. కేరెన్స్ డీజిల్​ వేరియంట్​ లీటరుకు 21.3 కిలోమీటర్లు, పెట్రోల్​ వెర్షన్​ 16.5 కిలోమీటర్ల మైలేజ్​ ఇస్తుంది. ఇందులో నెక్స్ట్ జనరేషన్ కియా కనెక్ట్‌‌‌‌‌‌‌‌ యాప్​, 10.25ఇంచుల  టచ్‌‌‌‌స్క్రీన్ నావిగేషన్, ఎనిమిది స్పీకర్లతో బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, వైరస్, బాక్టీరియా నుంచి రక్షించే స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్​, పనోరమిక్ సన్‌‌‌‌రూఫ్‌‌‌‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.   కియా కేరెన్స్​ - స్మార్ట్‌‌‌‌స్ట్రీమ్ 1.5-లీటర్ పెట్రోల్, స్మార్ట్‌‌‌‌స్ట్రీమ్ 1.4-లీటర్ టీజీడీఐ పెట్రోల్,1.5-లీటర్ సీఆర్​డీఐ వీజీటీ డీజిల్ ఇంజన్లతో వస్తుంది.  సిక్స్​-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌‌‌‌మిషన్, సెవెన్​-స్పీడ్ డీసీటీ,  సిక్స్​ -స్పీడ్ ఆటోమేటిక్ వెర్షన్లు ఉంటాయి. కేరెన్స్​ను ఇండియాలోనే తయారు చేశామని, దీనిని 80 దేశాలకు ఎగుమతి చేయనున్నారు.