ఎక్కువ కాలం రహస్యాన్ని దాచలేం: కియారా

ఎక్కువ కాలం రహస్యాన్ని దాచలేం: కియారా

ఇటు తెలుగు, అటు హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోన్న కియారా అద్వాని, త్వరలో ‘గోవింద్ నామ్ మేరా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరోవైపు రామ్ చరణ్‌కి జంటగా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే న్యూజిలాండ్ లోసాంగ్ షూట్‌ను కంప్లీట్ చేసింది. అయితే సినిమాల కంటే కూడా కియారా పర్సనల్‌‌ లైఫ్‌‌కు సంబంధించిన విషయాల కోసం ఎక్కువ క్యూరియాసిటీ చూపిస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా తన పెళ్లి గురించిన అప్‌డేట్‌ కోసం. బాలీవుడ్‌‌‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ప్రేమలో ఉన్న ఆమె, డిసెంబర్‌‌‌లో పెళ్లి చేసుకోబోతోందని ఇప్పటికే వార్తలొచ్చాయి. అదీకాక సోషల్‌‌మీడియాలో ఎంతో చురుకుగా ఉండే కియారా.. ఇటీవల ఓ పోస్ట్ చేసింది. 

‘ఎక్కువ కాలం రహస్యాన్ని దాచలేం.. త్వరలోనే ఆ సీక్రెట్ రివీల్ చేస్తాను’ అని చెప్పింది. దీంతో అది సిద్ధార్థ్ ల్హోత్రాతో మ్యారేజ్ విషయమేనని అంతా ఊహించారు. మాటిచ్చినట్టుగానే ఆ సీక్రెట్‌‌ను రివీల్ చేసింది. కానీ ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే అన్నట్టుగా పెళ్లి కబురు చెబుతుందనుకున్న కియారా.. ఇది తన కొత్త బ్రాండ్ ప్రమోషన్‌‌ అని తేల్చేసింది. కిమిరికా అనే బ్యూటీ ప్రొడక్ట్స్ సంస్థకి తను బ్రాండ్‌‌ అంబాసిడర్‌‌గా వ్యవహరిస్తున్న విషయాన్ని రివీల్ చేసింది. బ్రాండ్ పబ్లిసిటీ విషయంలో తన స్ట్రాటజీ పర్ఫెక్ట్‌గా వర్కవుట్ అయింది. కానీ మ్యారేజ్ విషయం చెబుతుందనుకున్న కియారా ఇలా షాక్ ఇవ్వడంతో అభిమానులు నిరుత్సాహ పడ్డారు. మరి అసలు మేటర్‌‌ ఎప్పుడు రివీల్ చేస్తుందో చూడాలి!