
కన్నడ స్టార్ సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సుదీప్ కెరీర్‌లో ఇది 47వ చిత్రం. బుధవారం ఈ చిత్రానికి ‘మార్క్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. మ్యాడ్, ఆటిట్యూడ్, రూత్ లెస్, కింగ్...అంటూ మార్క్ పేరులోని ఇంగ్లీష్ అక్షరాలకు డెఫినిషన్ ఇచ్చారు.
సుదీప్ పోషిస్తున్న అజయ్ మార్కండేయ పాత్ర పేరును సూచించేలా ‘మార్క్’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సుదీప్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన ఈ గ్లింప్స్‌కు అజనీష్ లోకనాథ్ అందించిన బీజీఎం ఆకట్టుకుంది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలింస్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. విక్రాంత్, నవీన్ చంద్ర, దీప్షిక, రోహిణీ ప్రకాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌లో గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.