రాష్ట్రంలో పెరిగిపోతున్న కిడ్నీ రోగాలు

రాష్ట్రంలో పెరిగిపోతున్న కిడ్నీ రోగాలు

రాష్ట్రంలో కిడ్నీ రోగాలు విజృంభిస్తున్నయి. మంథనివంటి ప్రాంతాల్లో నైతే ఊళ్లకు ఊళ్లను పీడిస్తున్నయి.ఒక్కో గ్రామంలో సగానికి సగం కిడ్నీ రోగాల బారినపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువ మందినిఇబ్బందిపెడుతున్న రోగాల్లో ‘క్రానిక్ కిడ్నీ డిసీజె-స్‌’తొలి స్థా నంలో ఉన్నట్టు ఆరోగ్యశ్రీ తాజా నివేదికవెల్లడిం చింది. 2017–18లో 3.09 లక్షల మందిఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందగా.. వారిలో 58,768మంది కిడ్నీ రోగులే. ఈ సంఖ్య 2016–17 కన్నా 11శాతం ఎక్కువ. అప్పుడు 52,752 మంది చికిత్సచేయించుకున్నారు. ఆరోగ్యశ్రీ కోసం గత ఆర్థికసంవత్సరం రూ.772.28 కోట్లు ఖర్చు చేయగాఅందులో రూ.83.15 (10.7%) కోట్లు కిడ్నీ చికిత్స-లకే కేటాయించారు. 2016–17లోనూ రూ.74.86(9.72%) కోట్లు కిడ్నీ వ్యాధులకే ఖర్చు చేశారు.

డయాలసిస్ నే 12 వేల ప్రాణాలు
రాష్ట్రంలో కిడ్నీ రోగాలు పెరుగుతుండటంతో ప్ర-భుత్వం గతేడాది 40 డయాలసిస్‌ సెంటర్లు ప్రారం-భించింది. నిమ్స్‌ పరిధిలో 16, గాంధీ కింద 13,ఉస్మానియా కింద 10 కేంద్రాలను జిల్లా, ఏరియా,అనుబంధ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశారు. వీటికితో-డు మరో మూడు చోట్ల కలిపి 42 కేంద్రాల్లో రక్తశుద్ధిసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వీటిల్లో 7,500మంది డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ప్రైవేటుఆస్పత్రుల్లో మరో 5 వేల మంది చేయించుకుంటు -న్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోఇప్పటివరకు 1,014 మంది కిడ్నీ మార్పిడి చేయించు-కోగా మరో 2 వేల మంది జీవన్ న్ లో రిజిస్ట్రేషన్‌ చే-యించుకున్నారు. జీవన్ న్ లోనూ కిడ్నీ మార్పిడులే(41.2 శాతం) ముందున్నాయి.

పెయిన్కిల్లర్స్మరోకారణం
రాష్ర్టంలో కిడ్నీ రోగాలు విజృంభించడానికి రెండుముఖ్య కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.ఒకటి మధుమేహం, రెండు పెయిన్‌ కిల్లర్స్‌, స్టెరాయిడ్స్‌, యాంటి బయాటిక్స్‌ ట్యాబ్లెట్లను ఎక్కువగావాడటం. గ్రామాల్లో నడి వయస్కులు, వృద్ధులు ఎక్కువగా సీకేడీ బారిన పడుతున్నారు. గ్రామాల్లో ఆర్‌‌ఎంపీ, పీఎంపీ వైద్యులు నొప్పి నివారణమందులు ఎక్కువగా ఇస్తున్నారని, అందులోనూ వారికి ‘మార్జిన్‌’ఎక్కువిచ్చే అనామక కంపెనీల ట్యాబ్లెట్లను అంటగడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. వాటి వల్ల నొప్పి తాత్కాలికంగా తగ్గినా కిడ్నీలపై తీవ్రప్రభావం పడుతోందని నెఫ్రాలజిస్ట్‌, డాక్టర్‌‌ శ్రీభూషణ్ రాజు తెలిపారు. ఎండాకాలంలో కిడ్నీలకు మరింతప్రమాదం పొంచి ఉంటుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు మూత్రపిండాలు తాత్కాలికంగా పనిచేయడం మానేసే అవకాశముంటుంది. ఉష్ణో గ్రతలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కిడ్నీ జబ్బుల బారినపడే వారి సంఖ్య పెరగడానికి డీహైడ్రేషన్‌ కూడా ఓకారణమని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టివేసవిలో నీరు, మజ్జిగ ఎక్కువ తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

పెయిన్‌ కిల్లర్‌‌ ట్యాబ్లెట్లతో జాగ్రత్త!

‘డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌, విచ్చలవిడిగా పెయిన్‌ కిల్లర్లు, యాంటీ బయాటిక్‌ ట్యాబ్లెట్లు వాడటంకిడ్నీల పనితీరును దెబ్బతిస్తు న్నాయి. కిడ్నీ సమస్యల పట్ల ప్రజలకు అవగాహన లేక.. కిడ్నీలుపాడవుతున్నట్లు గుర్తిం చలేకపోతున్నారు . దీంతో సమస్య తీవ్రమవుతోంది. ప్రైమరీ హెల్త్‌ సెంటర్లస్థా యి నుంచే కిడ్నీల స్ర్కీనింగ్ కు ఏర్పాట్లు చేయాలి. ఎర్లీ స్టేజ్ లో కిడ్నీ ఇన్ఫెక్షన్లు గుర్తిస్తే డయాలసిస్‌వరకూ వెళ్లాల్సి న అవసరం ఉండదు. దురదృష్టవశాత్తు 60 శాతం మంది డయాలసిస్‌ స్టేజ్ లోనే కిడ్నీపాడైనట్టు తెలుసుకుంటు న్నారు . అందుకే మరణాలు పెరుగుతున్నాయి.-డాక్టర్‌‌ శ్రీభూషణ్ రాజు, సీనియర్‌‌ నెఫ్రాలజిస్ట్‌, నిమ్స్‌.