వినోదం, విద్యకు నిర్వచనం కికీ అండ్ కోకో యానిమేషన్ మూవీ

వినోదం, విద్యకు నిర్వచనం కికీ అండ్ కోకో యానిమేషన్ మూవీ

లయన్ కింగ్, అలాద్దిన్, మహావతార్ నరసింహ లాంటి యానిమేషన్ చిత్రాలకు దక్కుతున్న ఆదరణ నేపథ్యంలో ‘కికీ & కోకో’ టైటిల్‌‌తో మరో యానిమేషన్ మూవీ ఇండియన్ స్ర్కీన్‌‌పైకి రాబోతోంది.  పి. నారాయణన్ దర్శకత్వంలో ఇనికా ప్రొడక్షన్స్‌‌ బ్యానర్‌‌‌‌పై ఈ చిత్రం రూపొందింది.

 త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా దర్శకుడు పి.నారాయణన్ మాట్లాడుతూ  ‘ఇది పిల్లలకే పరిమితం కాదు.  పెద్దల్లోనూ చిన్నప్పటి మధురానుభూతులను మరోసారి గుర్తు చేసే మాయా శక్తి ఇందులో ఉంది. చిన్నారుల వినోదం, విద్యకు కొత్త నిర్వచనం చూపే వినూత్న చిత్రం ఇది. కికీ అనే  కుక్క,  కోకో అనే చిన్నారి మధ్య ఉన్న అపూర్వమైన బంధాన్ని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం’ అని చెప్పారు.  

ఇదొక  సినిమా మాత్రమే కాదని,  స్నేహం, ప్రేమ, కథల ద్వారా పిల్లలు నేర్చుకునే విలువైన పాఠాల వేదిక అని క్రియేటివ్ ప్రొడ్యూసర్  జి.యం.కార్తికేయన్ అన్నారు.