
- నిద్రలేమితోపాటు బరువు 140 కిలోలకు పెరిగిండు
- దక్షిణ కొరియా సంస్థ వెల్లడి
సియోల్: నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నిద్రలేమి (ఇన్ సోమ్నియా)తో బాధపడుతున్నట్లు సౌత్ కొరియా నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్‌ఐఎస్)’ గురువారం వెల్లడించింది. కిమ్ మద్యం, సిగరెట్లకు బానిస అయినందుకే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపింది. నార్త్ కొరియా అధికారులు ఇన్ సోమ్నియాకు సంబంధించి ఫారిన్ మెడికల్ ఇన్ఫర్మేషన్‌ను కలెక్ట్ చేస్తున్నారని వివరించింది.
ప్రత్యేకించి జోల్పిడెమ్ లాంటి మందుల కోసం సెర్చ్ చేస్తున్నట్లు ఎన్ఐఎస్ తెలిపింది. కిమ్ మళ్లీ విపరీతంగా బరువు పెరిగారని, ఇప్పుడు ఆయన140 కిలోలు ఉంటారని పేర్కొంది. కిమ్ ఫ్యామిలీ అంతా జల్సాలకు అలవాటుపడినట్లు ఎన్ఐఎస్ తెలిపింది.