నార్త్ కొరియాలో కరోనా కేసుల ఉధృతి మరింతగా ఉండే ఛాన్స్ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. కొరియాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా మొదలు కాలేదని, దీంతో కరోనా కేసులు పెరిగిపోయే ప్రమాదం ఉందని WHO రీజినల్ డైరెక్టర్ పూనమ్ సింగ్ చెప్పారు. కరోనా నియంత్రణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు నార్త్ కొరియాలో కరోనా కల్లోలంపై అక్కడి అధికారుల నుంచి WHOకు ఇప్పటి వరకు అధికారిక సమాచారం అందలేదని స్టేట్ మెంట్ లో తెలిపారు. నార్త్ కొరియాలో ఆరోగ్య వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఇంటర్నేషనల్ హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. చైనాలో కరోనా రాగానే... ఇంటర్నేషనల్ బార్డర్స్ ను, వాణిజ్యాన్ని నార్త్ కొరియా నిలిపేసింది.
దీంతో అక్కడ కేసులు రాలేవని చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు మిసైల్ టెస్టులతో UN ఆంక్షలు నార్త్ కొరియాపై ఉన్నాయనే సంగతి తెలిసిందే. అటు సరిహద్దులు మూసేయడం, ఇటు ఆంక్షలతో నార్త్ కొరియా వాణిజ్యం పూర్తిస్థాయిలో దెబ్బతిన్నది. ఫైనల్ గా కరోనా తగ్గిందనుకున్న పరిస్థితిలో జనవరిలో చైనాతో వర్తక వాణిజ్యాలను రాకపోకలను తిరిగి మొదలు పెట్టింది. ఈ గ్యాప్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. 4 రోజుల వ్యవధిలో 10 లక్షల కేసులు వచ్చినట్లు చెబుతున్నారు. నార్త్ కొరియాలో కరోనా సంక్షోభంపై కింగ్ కిమ్ జోంగ్ ఉన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కిమ్ మాస్క్ పెట్టుకుని కనిపిస్తున్నారు. ఎక్కడికక్కడ చెకింగ్ లు కొనసాగుతున్నాయి. కరోనా నుంచి కోలుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను అక్కడి డాక్టర్లు జనానికి వివరిస్తున్నారు. ఉప్పునీళ్లతో పుక్కిలించడం ద్వారా రిలీఫ్ అవ్వొచ్చని సూచిస్తున్నారు.
