దర్శకుడు సత్యారెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ బుద్ధ’. ఈ చిత్రంలోని ‘వుయ్ వాంట్ వరల్డ్ పీస్’ పాటను శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ సునీల్ సేనేవి విడుదల చేసి.. ప్రపంచ చరిత్రలో బౌద్ధ దేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఏకైక చిత్రంగా ‘కింగ్ బుద్ధ’ నిలిచిపోతుందని అన్నారు. వచ్చే ఏడాది వరల్డ్‌వైడ్‌గా వందకు పైగా భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని సత్యారెడ్డి చెప్పారు.
