కోహ్లీ కిక్లీ డ్యాన్స్ చూశారా.. ఐపీఎల్ సంబురాల్లో పిల్లోడిలా మారిపోయిన కింగ్!

కోహ్లీ కిక్లీ డ్యాన్స్ చూశారా.. ఐపీఎల్ సంబురాల్లో పిల్లోడిలా మారిపోయిన కింగ్!

కింగ్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో.. సంబరాల్లో అంత చిలిపిగా మారిపోతుంటాడు. విరాట్ పలు సందర్భాల్లో చేసిన  అల్లరి ఫ్యాన్ ఎప్పటికీ మరిచిపోలేరు. లేటెస్టుగా ఐపీఎల్–2026 ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తో కలిసి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

2026 మే 31 (ఆదివారం) జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ (GT) పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (RCB) థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్సీబీ టీమ్ ఎంత సంబరాల్లో మునిగిపోయిందో సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది. విన్నింగ్ సిక్స్ కొట్టిన కోహ్లీ.. గ్రౌండ్ లోనే గెలుపును సెలబ్రేట్ చేసుకున్నాడు. ఫ్లైయింగ్ కిస్సులతో తన వైఫ్ అనుష్క శర్మతో తన గెలుపు సంబరాలను పంచుకున్నాడు. లక్షలాది ఫ్యాన్స్ మధ్య రెండో ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడాడు.

అహ్మదాబాద్ లో గుజరాత్ పై 5 వికెట్ల గెలుపుతో గ్రౌండ్ తో పాటు.. బయట కూడా సంబరాలు అంబరాన్ని తాకేలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో విరాట్, భువనేశ్వర్ ఇద్దరూ కలిసి తమ ఫ్రెండ్షిప్ గురించి చెప్పకనే చెబుతూ.. సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్న తీరు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరూ కలిసి కిక్లీ డ్యాన్స్ చేసిన వీడియోను కోహ్లీ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు ఫుల్ బజ్ క్రియేట్ చేస్తోంది.

  • కిక్లీ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఇంప్రెస్:

కింగ్ కోహ్లీ, భువీ చేసిన కిక్లీ డ్యాన్స్ కు ఫ్యాన్స్ తెగ ఇంప్రెస్ అవుతున్నారు. ఇద్దరు చేసిన కిక్లీ డ్యాన్స్.. కిక్లీ డ్యాన్స్ అనే పదం వైరల్ గా మారింది. చిలిపిగా ఒకరి చేతులు మరొకరు క్రాస్ గా పట్టుకుని (అంటే ఒకరి కుడి చేయి మరొకరి ఎడమ చేయిని పట్టుకోవడం) వెనకకు బ్యాలెన్స్ చేస్తూ చుట్టూ తిరగడం కిక్లీ డ్యాన్స్ అంటారు.

►ALSO READ | IPL 2026 ఫైనల్‎లో ఆర్సీబీ గెలుపుకు టర్నింగ్ పాయింట్ అదే: హర్భజన్ సింగ్

కిక్లీ డ్యాన్స్ అనేదీ పంజాబ్ లో ఫేమస్ డ్యాన్స్. చిన్న పిల్లలు ఆడుకునే ఆట ఇది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ డ్యాన్స్ ఫేమస్. తెలంగాణలో మహబూబ్ నగర్ ప్రాంతంలో ఈ డ్యాన్స్ ను ఒడ్డోళ్ల బండి తిరగటం అంటారు. చిన్న పిల్లలు ఆడ, మగ తేడా లేకుండా ఆడే సరదా ఆట ఇది. 

గెలిచిన ఆనందంలో కోహ్లీ, భువనేశ్వర్ చేసిన ఈ డ్యాన్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ డ్యాన్స్ కు కిక్లీ బాయ్స్ అనే క్యాప్షన్ ఇచ్చాడు కింగ్. 

భువీ, కోహ్లీ టైటిల్ విన్నింగ్ లో కీలక పాత్ర పోషించారు. కోహ్లీ 16 ఇన్నింగ్స్ లో 675 పరుగులు చేసి ఫ్రాంఛైజ్ లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు. 165.85 స్ట్రైక్ రేట్ తో 56.25 యావరేజ్ తో టాప్ లో నిలిచాడు. 

మరోవైపు భువీ.. 16 మ్యాచులలలో 28 వికెట్లు తీశాడు. ఫైనల్ లో 2 వికెట్లు తీసి 29 రన్స్ మాత్రమే ఇచ్చి.. ఆర్సీబీ విన్ లో కీలక పాత్ర పోషించాడు.