IPL 2026 ఫైనల్‎లో ఆర్సీబీ గెలుపుకు టర్నింగ్ పాయింట్ అదే: హర్భజన్ సింగ్

IPL 2026 ఫైనల్‎లో ఆర్సీబీ గెలుపుకు టర్నింగ్ పాయింట్ అదే: హర్భజన్ సింగ్

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 ఫైనల్‎లో ఆర్సీబీ గెలుపుపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అవుటవ్వడమే మ్యాచ్‌కు అత్యంత కీలకమైన మలుపు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజస్థాన్‎తో జరిగిన క్వాలియఫర్ 2లో సెంచరీతో సూపర్ ఫామ్‎లో ఉన్న గిల్ ఫైనల్‎లో త్వరగా ఔట్ కావడంతో మ్యా్చ్ అక్కడే ఆర్సీబీ వైపు మలుపు తిరిగిందని పేర్కొన్నారు. 

ఫైనల్‏లో గిల్‎దే ఆర్సీబీకి కీలకమైన వికెట్ అని.. ఎందుకంటే ఈ సీజన్‎లో జీటీ తరుఫున నిలకడగా పరుగులు సాధిస్తున్న ప్రధాన బ్యాటర్ అతనేనని.. ఏ బౌలర్‌నైనా గిల్ ఎదుర్కొగలడని అన్నారు. కానీ ఫైనల్ వంటి కీలక మ్యాచులో గిల్ త్వరగా ఔట్ కావడం గుజరాత్ విజయావకాశాలను దెబ్బ తీసిందన్నాడు. గిల్ త్వరగా ఔట్ కాకపోతే స్కోర్ బోర్డుపై జీటీ మరిన్ని పరుగులు పెట్టేదన్నారు. 

గిల్ వికెట్  పై సునీల్ గవాస్కర్ రియాక్షన్

ఫైనల్ మ్యాచులో గిల్ ఔట్‎పై భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా రియాక్ట్ అయ్యారు. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‏ను టార్గెట్ చేసిన మాదిరిగానే హేజిల్ వుడ్‏ బౌలింగ్ లో ఆడాలని గిల్ భావించాడు. కానీ హేజిల్‌వుడ్ తన మణికట్టును ఉపయోగించినప్పుడు బంతి కొంచెం ఎక్కువగా బౌన్స్ అవ్వడంతో గిల్ వికెట్ సమర్పించుకున్నాడని అన్నారు.