కిన్నెరసానికి జాతీయస్థాయి గుర్తింపు రావాలి: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ అంకిత్

కిన్నెరసానికి జాతీయస్థాయి గుర్తింపు రావాలి:  కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ అంకిత్

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యాటక రంగానికి మణిహారంగా నిలిచిన కిన్నెరసానికి జాతీయస్థాయి గుర్తింపు రావాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకాంక్షించారు.

రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్చువల్‌‌‌‌‌‌‌‌గా పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా గురువారం కిన్నెరసానిలో రూ.40 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన మూడు సఫారీ వాహనాలు, సీతాకోకచిలుకల పార్కు, సిమెంట్ రోడ్డు, ఫీడింగ్ భవనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అటవీ సంపదకు నిలయమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సీతాకోకచిలుకల పార్కులో మొక్కలు నాటారు.