Kiran Abbavaram-Rahasya: పెళ్లి డేట్ ప్రకటించిన టాలీవుడ్ యంగ్ హీరో

Kiran Abbavaram-Rahasya: పెళ్లి డేట్ ప్రకటించిన టాలీవుడ్ యంగ్ హీరో

రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. వధువు మరెవరో కాదు తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ (Rahasya Gorak).గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరిగింది.

ఇక వీరి వివాహం ఆగస్టు  22న కర్ణాటకలో కూర్గ్‌లో జరగనుంది. హీరోయిన్ రహస్య బంధువులంతా ఆ ఊరిలోనే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకకు హీరో కిరణ్ స్నేహితులు, బంధువులు హాజరవుతారు.ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం కిరణ్ నటిస్తున్న 'క' అనే సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సోమవారంరిలీజ్ అయింది.ఆ సాంగ్ రెస్పాన్స్ గురించి ఒక వీడియో రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరం అందులోనే తన పెళ్లికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాడు.వీరిద్దరూ ముందుగా కేరళలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అక్కడ వరదలతో పరిస్థితి భయనకరంగా ఉంది. అందుకే పెళ్లి వేదికను కర్ణాటకకు మార్చినట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే..రాజావారు రాణిగారు సినిమా తర్వాత రహస్య గోరఖ్ సినిమాల్లో నటించలేదు.చాలా ఏళ్ళ నుండి సినిమాలకు దూరంగానే ఉంటున్నారు ఆమె. ఇక కిరణ్ అబ్బవరం మాత్రం హిట్స్,ఫ్లాప్స్ తో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో కెరీర్ లో మొదటి బ్రేక అందుకున్న ఈ హీరో..చాలా కాలం తరువాత వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ బాట పట్టాడు. ఇటీవల రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఆ సినిమాతో మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇప్పుడు సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకొని తాజాగా  కొత్త సినిమా 'క'నుంచి టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.