550 థియేటర్స్ లలో “నేను మీకు బాగా కావాల్సినవాడిని”

550 థియేటర్స్ లలో  “నేను మీకు బాగా కావాల్సినవాడిని”

రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో కిరణ్ అబ్బవ‌రం.. తాజాగా ఈ యవ హీరో నటిస్తోన్న మూవీ “నేను మీకు బాగా కావాల్సినవాడిని”. శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కోడి రామ‌కృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మించారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. ఇప్పటికే  పాటలు మంచి క్లిక్ అవ్వడం, పవర్‌స్టార్‌ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.  ఈ నెల 16న గ్రాండ్ గా 550 పైచిలుకు థియేటర్స్ లలో ఈ చిత్రం  రిలీజ్ అవుతోంది. ఈ  సందర్భంగా  హీరో కిరణ్ అబ్బవరం మీడియాతో ముచ్చటించారు. 

పవన్ లాంచ్‌ చేయడం సంతోషంగా ఉంది

దర్శకుడు కోడి రామకృష్ణ  అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి పెరిగాను. ఆయనతో పనిచేసే అవకాశం దొరకకపోయినా ఆయన కూతురు కోడి దివ్య దీప్తితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ ను పవన్ లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ పవన్‌ సార్‌

మన అందరి ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా  ఉంటుంది.

కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్‌ పాయింట్‌ని డిస్కస్‌ చేశాం. ఎస్వీ కృష్ణారెడ్డి  పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది . ఇందులో తండ్రి కూతుళ్లు ఎమోషన్స్ కు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వతారు.  సినిమాను చూసిన వారందరూ కచ్చితంగా ఎంజాయ్  చేస్తారు .

కెరియర్ కు చాలా బూస్టప్

హీరోగా సెటిల్ అవుతున్న టైంలో ఇలాంటి కథ నా కెరియర్ కు చాలా బూస్టప్ ఇస్తుంది.ఇందులో  రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను.ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను. హీరోయిన్ కు కూడా మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ దొరికింది. దర్శకుడు  శ్రీధర్,  నా కాంబినేషన్ లో సినిమా చేయడానికి  కొంతమంది ప్రయత్నించినప్పటికీ.. కోడి దివ్య  బ్యానర్ లో ఫైనల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా కథ డిమాండ్ మేరకు డైలాగ్ వెర్షన్ నేనే రాశాను.ఇందులో నాది బాబా భాస్కర్ ల ట్రాక్ చాలా బాగుంటుంది.

సినిమా అనుకున్న దాని కంటే బాగా వచ్చింది

నిర్మాత కోడి దివ్య, దీప్తి సహకారం వల్లే  ఈ సినిమా అనుకున్న దాని కంటే బాగా వచ్చింది. మణిశర్మతో కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది.అయన ఇచ్చిన పాటలు, ఆర్ ఆర్ అద్భుతంగా మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. అలాగే ఫైట్స్, ఎమోషన్స్ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి.

శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం

గీతా ఆర్ట్స్ లో "వినరో విష్ణు భాగ్యం", మైత్రి మూవీ మేకర్స్ లో  "మీటర్ " ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఏ యం రత్నం బ్యానర్ లోని రూల్స్ రంజన్ సినిమా 40% షూటింగ్ అయ్యింది.ఇవి కాకుండా ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం చేసే అవకాశం ఉంది.