
కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కె-ర్యాంప్’. యుక్తి తరేజా హీరోయిన్. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. ఈ మూవీ సాంగ్ రిలీజ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘కలలే కలలే’ అనే పల్లవితో సాగే పాటను ఈ నెల 9న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
‘లవ్ లో ఉన్నవాళ్లు ఫీల్ అవ్వండి, లేని వాళ్లు ఊహించుకోండి, మ్యాజికల్ మెలొడీ వస్తోంది..’ అంటూ ఈ పాట గురించి హీరో కిరణ్ అబ్బవరం ట్వీట్ చేశాడు. ఇప్పటికే టీజర్‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్, ఇటీవలే ఫస్ట్ సింగిల్ ‘ఓనమ్’ తో ఆకర్షించారు.
ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఎనర్జిటిక్ ట్యూన్ అందించారు. ఇప్పుడు తనదైన మెలోడీతో ఎలాంటి ట్యూన్ ఇవ్వనున్నాడో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది.
Love lo unna vallu feel avvandi ❤️
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) September 4, 2025
Leni vallu oohinchukondi 😉
Magical melody from Sep 9th ☺️#Kalalekalale #KRamp pic.twitter.com/UuITi86qbf