ఫ్లవర్ కాస్త ఫైర్ అయితే.. దీపావళికి కిరణ్ అబ్బవరం మూవీ

ఫ్లవర్ కాస్త ఫైర్ అయితే.. దీపావళికి కిరణ్ అబ్బవరం మూవీ

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా దర్శకుడు  జైన్స్ నాని రూపొందించిన  చిత్రం ‘కె -ర్యాంప్‌‌‌‌’.  రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మించారు. దీపావళి కానుకగా  అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది.  ఇప్పటికే రెండు పాటలను  రిలీజ్ చేయగా మంగళవారం టైటిల్ సాంగ్‌‌‌‌ను  రిలీజ్ చేశారు.  చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన పాటకు సురేంద్ర కృష్ణ  క్యాచీ లిరిక్స్ రాయగా,  సాయి చరణ్ భాస్కరుని ఎనర్జిటిక్‌‌‌‌గా పాడాడు.​ 

  ‘కలిసి వచ్చే కాలం ముందు నువ్వు సూపర్ రా.. టైమ్ కాస్త బ్యాడ్ అయితే  కె ర్యాంప్ రా..  ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా..   ఫ్లవర్ కాస్త ఫైర్ అయితే  కె ర్యాంప్ రా,  ఒక్క పెగ్ కిక్కు ఇస్తే నువ్వు సూపర్ రా..  ఫుల్ కొట్టినా పిచ్చి పడితే కె ర్యాంప్ రా..టిక్కల్ టిక్కల్.. ఢమాల్ ఢమాల్..’ అంటూ  లవర్, లైఫ్ మధ్య హీరో ఎలా నలిగిపోయాడో చూపిస్తూ సాగిన పాట  ఆకట్టుకుంది.  నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.