ధరణిపై త్వరలో మధ్యంతర నివేదిక: కోదండరెడ్డి

ధరణిపై త్వరలో మధ్యంతర నివేదిక: కోదండరెడ్డి
  • కాంగ్రెస్ హామీలను నెరవేరుస్తూ వస్తున్నం
  •  కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా టైమివ్వాలి
  • ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతల అసత్యాలు
  • కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి

ధరణిపై త్వరలో మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని కిసాన్ సిల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి తెలిపారు. గాంధీ భవన్ లో మీడియాదో మాట్లాడిన ఆయన ధరణిపై లోతైన ఎంక్వైరీ జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో భూముల రిజిస్టేషన్ వ్యవస్థ చాలా బాగుంది. దాన్ని అధ్యయనం చేస్తం..విధ్వంసమైన వ్యవస్థను చక్క బెట్టడానికి కొత్త ప్రభుత్వానికి కనీసం సంవత్సరం అయినా సమయం ఇవ్వాలన్నారు. 

కాంగ్రెస్ హామీలను నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. గతంలో మంత్రిగా కేటీఆర్ దావోస్ పర్యటనలో  కాకిలెక్కలు చెప్పారు. ఓటమిని ర్లించుకోలేక బీఆర్ఎస్ నేతలు సత్యాలు మాట్లాడుతున్నారని అన్నారు.