కేంద్ర పథకాల అమలుకు రాష్ట్రం సహకరించట్లే: కిషన్ రెడ్డి

కేంద్ర పథకాల అమలుకు రాష్ట్రం సహకరించట్లే: కిషన్ రెడ్డి

 కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  కేంద్రం ఏం అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.  ట్రైబల్ యూనివర్శిటీ డీపీఆర్  కోసం కేంద్రం కోటి రూపాయలు ఇచ్చిందని  కానీ..  రాష్ట్ర ప్రభుత్వం  స్థలం కూడా కేటాయించడం లేదని ఆరోపించారు.  జేబీఎస్, ఫలక్ నుమా మెట్రో కోసం కేంద్రం రూ.1250 కోట్లు ఇచ్చిందని చెప్పారు.  అయితే  ఎంఐఎం నేతల ఆస్తుల కోసమే ఫలక్ నుమా మెట్రోను అడ్డుకున్నారని ఆరోపించారు.

ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ల్యాండ్ ఇవ్వలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు.   ఘట్ కేసర్, యాదాద్రి ఎంఎంటీ కోసం భూములివ్వడం లేదని ఆరోపించారు.  జనం రాసే ఉత్తరాలకు తాము సమాధానం చెబుతాం కానీ.. తమ ఉత్తరాలకు సమాధానం చెప్పే  సంస్కారం కేసీఆర్ కు లేదన్నారు.  రామగుండం, బీహెచ్ఈఎల్ ,శంషాబాద్ లో ఈఎస్ఐ ఆస్పత్రులు నిర్మిస్తామని పదే పదే లేఖ రాసినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.