దొంగ దారిలో వచ్చిన వారిని ఎలా అనుమతిస్తాం

దొంగ దారిలో వచ్చిన వారిని ఎలా అనుమతిస్తాం

హైదరాబాద్ ని రెండో రాజధాని చేయాలనే ఆలోచన లేదన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఈ చట్టం వల్ల ఏ ఒక్క బారతీయునికి నష్టం లేదని చెప్పారు. మోడీ ప్రభుత్వం సంస్కరణల ప్రభుత్వమని, రాబోయే రోజుల్లో కూడా సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు.

ఏ ఒక్కరినీ ఈ దేశం నుండి పంపించామని చెప్పారు కిషన్ రెడ్డి. దేశంలో ముస్లింలకు ఎక్కడా అన్యాయం జరగలేదన్నారు. కొన్ని రాష్ట్రాలు రిజర్వేషన్లు ఇచ్చాయని.. వారిలో రాష్ట్రపతి అయిన వాళ్లు కూడా ఉన్నారన్నారు. సరైన అవగాహాన లేకుండా విద్యార్థులు రోడ్ల మీదకు ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదన్నారు మంత్రి.  భారతీయుల ఆస్తులు ఇతర దేశాల్లో ఉంటే స్వాధీనం చేసుకునే అధికారం NIA కి ఉంటుదన్నారు.

ప్రతిపక్షాలు సీఏఏ పై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్న కిషన్ రెడ్డి.. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ ఇంటికి వెళ్లాలంటే వివరాలు ఇచ్చి, అనుమతి తీసుకొని వెళ్ళాలని.. వాళ్ళ ఇళ్లలోకి కిటికీల నుండి, గోడలు దూకి వస్తే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. దేశం కూడా అలాంటిదేనని… దొంగ దారిలో వచ్చిన వారిని ఎలా అనుమతిస్తాం అని అన్నారు.

అస్సాం,బెంగుళూరు లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు డిటెన్షన్ సెంటర్ లను ఏర్పాటు చేసాయని, మోడీ ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఎన్ని విధాలుగా ప్రచారం చేయాలో అన్ని రకాలుగా చేశారని చెప్పారు  ప్రాంతీయ పార్టీలు కూడా ఈ బిల్లు గురించి అవగాహాన లేక మాట్లాడుతున్నాయని.. భారత ప్రభుత్వాన్ని నడిపిస్తోంది వారు కాదని అన్నారు. వారు కేవలం పాత బస్తి వరకే పరిమితమని చెప్పారు.

Kishan Reddy attended the Meet the Press event at Bashir Bagh Press Club