ఏ అధికారి ఎక్కడ ఉన్నాడో కేసీఆర్ కు తెలియదు

ఏ అధికారి ఎక్కడ ఉన్నాడో  కేసీఆర్ కు తెలియదు

గెలుపు కోసం టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కుతుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అన్ని మున్సిపాలిటీలలో బీజేపీ  మొదటి సారిగా పోటీ చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి సొంత గడ్డ సిద్దిపేటలో కూడా మంచి ఫలితాలు వస్తాయన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల నుండి టిఆర్ఎస్ కు అడ్డదారులు తొక్కడం అలవాటుగా మారిందన్నారు. ఎన్నికల కమిషన్ ను బెదిరించి ఎన్నికలు జరుపుతుందన్నారు.  ఖమ్మం ప్రజలు చాలా చైతన్యవంతులని .. ఖమ్మంలో మార్పు వస్తుందనే విశ్వాసం ఉందన్నారు. జాతీయ పార్టీలకు పట్టం కట్టే అలవాటు ఖమ్మం ఓటర్లకు ఉందన్నారు. టీఆర్ఎస్ కు ఖమ్మం అంటే ద్వేషమన్నారు. ఖమ్మంకు టీఆర్ఎస్ చేసిందేమి లేదన్నారు. గతంలో పని చేసిన ముఖ్యమంత్రులను ప్రజలు కలిసే వారు..కానీ నేడు ముఖ్యమంత్రి కార్యాలయం , నివాసం వద్ద నో -ఎంట్రీ బోర్డులు దర్శనమిస్తున్నాయన్నారు. సచివాలయం ఉంటే  రావాల్సి ఉంటదని సచివాలయం కూల్చారన్నారు. ఏ అధికారి ఎక్కడ ఉన్నాడో కేసీఆర్ కు తెలియదన్నారు. ఏడేళ్ల నుంచి ఖమ్మంలో ఏదైన అభివృధ్ది జరిగిందంటే అది జాతీయ రహదారులు మాత్రమేనన్నారు. ఖమ్మంలో అత్యధిక జాతీయ రహదారులను అభివృద్ధి చేసింది బీజేపీ అని అన్నారు.