జనాన్ని భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ ప్లాన్ : కిషన్ రెడ్డి

జనాన్ని భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ ప్లాన్ : కిషన్ రెడ్డి

మతకల్లోలాలు, ఉగ్రవాద దాడులు జరిగితే కేంద్రం చూస్తూ ఊరుకోదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం బురుద రాజకీయాలు చేస్తూ, ప్రజల మధ్య ఒకరంటే ఒకరికి అనుమానం కలిగేలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ ఎంసీ పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో అధికారుల్ని ఉసిగొల్పి ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల ముందు కేటీఆర్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేసి ప్రజల్ని బయపెట్టారని గుర్తు చేసిన కిషన్ రెడ్డి.., పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ లను కూల్చేస్తామన్న ఎంఐఎం వ్యాఖ్యల్ని ఖండించారు. ఎన్నికలే కాదు దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగితే కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీజేపీ  ఆరున్నరేళ్లుగా కేంద్రాన్ని పాలిస్తుందని, ఎక్కడా, ఎలాంటి విధ్వంసాలు జరిగిన దాఖలాలు లేవని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు.