
హైదరాబాద్ : చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు ఈనెల 27న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. NTR స్టేడియంలో మైనారిటీ అఫైర్స్, కల్చరల్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాల నుండి 350 మంది చేతివృత్తుల కళాకారులు స్టాల్స్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ముక్తార్ అబ్బాస్ ప్రారంభిస్తారని చెప్పారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నాంపల్లి డివిజన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలకు ఈ- శ్రమ్ కార్డులను అందించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రభుత్వం నుండి స్వయం ఉపాధి కోసం పెన్షన్, బీమా, ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుందని తెలిపారు కిషన్ రెడ్డి.
ఈరోజు హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్, నాంపల్లిలో లబ్ధిదారులకు ఈ-శ్రమ్ కార్డులను అందజేయడం జరిగింది.@narendramodi గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రభుత్వం నుండి స్వయం ఉపాధి కోసం పెన్షన్, బీమా & ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది. pic.twitter.com/btY7vSenqB
— G Kishan Reddy (@kishanreddybjp) February 24, 2022