హైదరాబాద్: వీహెచ్‌పీ కార్యకర్తలపై నిన్న (అక్టోబర్ 19) జరిగిన లాఠీచార్జ్‌ను ఖండిస్తున్నామని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలో శనివారం హిందు సంఘ నేతలపై జరిగిన లాఠీ చార్జ్‌పై ఆయన స్పందించారు. ఆదివారం (అక్టోబర్ 20) హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముత్యాలమ్మ దేవాలయంలో పోలీసులు రక్తాభిషేకం చేశారు.. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న వారిని ఉగ్రవాదులను కొట్టినట్లు కొట్టారని మండిపడ్డారు.
Also Read :- 99 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హిందు పండగలపై అనేక నిర్భందాలు విధిస్తున్నారని.. హిందువుల విషయంలో ప్రభుత్వం వివక్ష వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగితే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని.. అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని అన్నారు.