సీఎం కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ

సీఎం కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి టీఆర్ఎస్ సర్కారు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. 2014 -20 మధ్యకాలంలో తెలంగాణకు కేటాయించిన సగటు వార్షిక రైల్వే బడ్జెట్ కన్నా 2022 -23 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మొత్తం నిధులను కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందని అన్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా 1,300 కిలోమీటర్లకుపైగా రైల్వే పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. రైల్వే లైన్ల నిర్మాణం కోసం భూసేకరణ, వివాదాల పరిష్కారం, నిధుల్లో రాష్ట్ర వాటా ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కారణంగానే రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరించి.. తెలంగాణ ప్రజలకు రైల్వేలను మరింత చేరువ చేయాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు.

For more news..

మియామీలో హెలికాప్టర్ ప్రమాదం.. వీడియో వైరల్

చావడానికైనా సిద్ధమే కానీ తలవంచను