విశాఖ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం

విశాఖ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం

వైజాగ్ లోని ఆర్ఆర్ వెంటకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం.తెలిపిన కిష‌న్ రెడ్డి..పరిస్థితిని తెలుసుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, DGP లతో ఫోన్ లో మాట్లాడి ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నానన్నారు. అవసరమైన సహాయక చర్యలు అందించాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించిన‌ట్లు చెప్పారు. ఈ దురదృష్టకర సంఘటనలో వందలాది మంది ప్రజలు కూడా ప్రభావితమవ్వటం భాధకారమ‌ని..కేంద్ర హోంశాఖ కార్యదర్శితో కూడా మాట్లాడాను అన్నారు.

విపత్తు ప్రాంతంలో అన్ని విధాలుగా సహాయం అందించమని సూచించాన‌న్నారు. అవసరమైన సహాయక చర్యలు అందించాలని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలకు సూచించటంతో, వారు క్షేత్ర స్థాయిలో సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని.. అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం, రాష్ట్ర, కేంద్ర అధికారులతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు కిష‌న్ రెడ్డి.